google.com, pub-8530363442855224, DIRECT, f08c47fec0942fa0>

Macadamia: మకడామియా నట్స్‌తో బోలెడంతా ఆరోగ్యం..! డ్రైఫ్రూట్స్‌లన్నింటిలో కెల్ల ఇది తాతలాంటిది..

 

మకడామియాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలం. ఇందులో రాగి, జింక్ పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
అంతేకాదు మకడామియాలో విటమిన్ బి1, మాంగనీస్ కూడా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు చేస్తుంది. మకడామియాలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు మకడామియా డైట్ లో చేర్చుకోవాలి. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది.

ఆరోగ్యకరమైన ఎముకలకు మకడామియా సహాయపడుతుంది. మకడామియాలో ఫైబర్ కడుపు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. మకడామియా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. మకడామియా నట్స్‌లో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. మకడామియా నట్స్‌ గుండె సమస్యలను నయం చేస్తాయి. మకడామియా నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్ ఈ, ప్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా మకడామియా నట్స్‌ ఉపయోగపడతాయి. మకడామియా నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వాపు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని నయం చేస్తాయి. మకడామియా నట్స్‌ తింటే బరువు తగ్గడానికి అవకాశం లభిస్తుంది. మకడామియా నట్స్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్‌ అందిస్తుంది. మకడామియా నట్స్‌ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.

Leave a Comment