లోబిపితో బాధపడుతున్నారా, ఇప్పుడు చెప్పే కొన్ని యోగాసనాల, యోగా ముద్రలతో సమస్యకి చెక్

 

హైపోటెన్షన్ బ్లడ్ సర్క్యూలేషన్‌ని తగ్గించడాన్నే లోబిపి అంటారు. దీని వల్ల బాడీలో నీరసం, అలసట వంటివి ఉంటాయి. వీటికి చెక్‌పెట్టేందుకు హెల్దీ లైఫ్‌స్టైల్‌తో పాటు కొన్ని యోగాసనాలు కూడా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకోండి.

లోబిపితో బాధపడుతున్నారా, ఇప్పుడు చెప్పే కొన్ని యోగాసనాల, యోగా ముద్రలతో సమస్యకి చెక్

 

యోగాలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్లు లోబిపికి కూడా ఉంది. లోబిపి ఉంటే చాలా మంది నాలుగు అడుగులు వేయగానే నీరసం, నిద్రలేవగానే తల తిరిగినట్లుగా అనిపించడం, ఊరికే అలసిపోవడం, వికారంగా ఉండడం, దృష్టి సమస్యలు ఉంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు కొన్ని నేచురల్ మెథడ్స్ ఉన్నాయి. అందులో యోగాసనాలు కూడా ఉన్నాయి.
సాధారణంగా మన బ్లడ్ ప్రెజర్ రెగ్యులర్‌గా 120/80 mm Hg కంటే తక్కువగా ఉంటే అది లోబిపి.. హైబీపి ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో లోబిపి ఉన్నప్పుడు కూడా అంతే ఇబ్బందులు ఉంటాయి. అందుకే, సరైన బ్లడ్ ప్రెజర్‌ని మెంటెయిన్ చేయడం ఆరోగ్యానికి మంచిది. దీనికోసం యోగా ది బెస్ట్.
యోగాతో మన శరీరానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అందుకే, ఇప్పుడు లోబిపికి చెక్ పెట్టే యోగాసనాల గురించి తెలుసుకోండి.

 

మత్స్యాసన

లోబిపి అనేది డీహైడ్రేషన్ కారణంగా రావొచ్చు. ఇది హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి, దీనికి మత్స్యాసనం చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
ఎలా చేయాలంటే
ముందుగా కాళ్లని చాచి వెల్లకిలా పడుకోండి. చేతులని చాపండి. ఇప్పుడు కాళ్ళని మడిచి పద్మాసనంలా కాళ్ళని ఉంచండి. మీ మోచేతులతో పాదాలను పట్టుకోండి. వీపు భాగాన్ని పైకి లేపండి. తలని నేలకి తగిలేలా ఉంచండి. ఇదే ఆసన స్థితిలో కాసేపు ఉండి తర్వాత యథాస్థానానికి రండి.

 

వజ్ర ముద్ర

​యోగాలో ముద్రలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. దీనికోసం వీపుని స్ట్రెయిట్‌గా పెట్టి కూర్చోవాలి. చూపుడు వేలుని తిన్నగా చాపాలి. బొటనవేలు మధ్యవేలు కలపండి.
మిగతా వేళ్లు స్ట్రెయిట్‌గానే ఉంచాలి. ఇదే ముద్రలో ఐదు నిమిషాల పాటు ఉంటూ బ్రీథింగ్ సరిగా తీసుకోవాలి. దీంతో చాలా వరకూ సమస్యలకి చెక్ పెట్టొచ్చు.

ఉష్ట్రాసన లేదా ఒంటె ఆసనం

ఈ ఆసనం చేయడం వల్ల బ్రెయిన్‌కి రక్తప్రవాహం పెరుగుతుంది. నాడీ వ్యవస్థని శాంతపరుస్తుంది. వెన్నెముకని టోన్ చేస్తుంది.
ఎలా చేయాలి.
ముందుగా యోగా మ్యాట్‌పై మోకాళ్లపై కూర్చునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు గాలిపీల్చుకుంటూ తల, చేతుల్ని మెల్లిగా పైకి చూపిస్తూ పైకి లేపండి. మెల్లిగా చేతుల్ని వెనక్కి వంచుతూ నడుముభాగాన్ని వెనక్కి వంచండి. సపోర్ట్ కోసం అరచేతుల్ని పాదాలని పట్టుకోండి. దీనిని పది నిమిషాల పాటు చేసి తర్వాత యథాస్థానానికి రావాలి.

సేతు బంధాసనం

  • నేల మీద వెల్లకిలా పడుకోవాలి. కాళ్లని మడిచి ఉంచండి.
  • రెండు పాదాలని దూరంగా ఉంచాలి. చేతులని వెనక్కి చాపాలి.
  • శ్వాస తీసుకుంటూ లోయర్ బ్యాక్‌ని పైకి లేపుతుండండి.
  • కాసేపు అలానే ఉండి శ్వాస వదులతూ నడుముని కిందకి దించాలి. ఇలా వీలైనన్నీ సార్లు చేయండి.

యోగా ముందు

యోగా చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
యోగా మ్యాట్‌పై నిటారుగా నిల్చోండి. గాలి పీల్చుకుని ముందు నుడి తలపైకి మీ చేతులని పైకి లేపండి. తర్వాత ముందుకు వంగి అరచేతులు నేలని తాకేలా చూడండి. మీ నుదిటిని మోకాళ్లను తాకేవరకూ ముందుకు వంగండి. మీరు పూర్తిగా వంగలేకపోతే మోకాళ్లని కొద్దిగా వంచొచ్చు. ఉండగలిగినంత సేపు ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత మెల్లిగా పైకి లేవాలి.

Leave a Comment