మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.