ప్రతి విషయంలోనూ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అలానే పెళ్లిలోనూ ఉంటాయి. ముఖ్యంగా, భర్త కొన్ని విషయాలు భార్యలకి చెప్పకపోవడమే మంచిదని చెబుతారు.

భార్యాభర్తల అనుబంధం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కూడా కష్ట సుఖాలని పంచుకుంటారు. అయినప్పటికీ భర్తలు కొన్ని విషయాలను భర్త నుంచి దాచిపెట్టడం మంచిది. లేదంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతుంటారు. అవేంటంటే
దానం గురించి

చాలా మంది దానాలు చేయడం.. వాటిని పది మందికి చెప్పుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ, కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. అలానే భర్త చేసే దానాలు భార్యకి చెప్పకపోయినా పర్లేదు. దీని వల్ల మీరు చేసిన హెల్ప్‌కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. అదే విధంగా, భార్యల్ని బట్టి మనం కొన్ని దానం చేశామంటే కొందరు అవి ఎక్కువ అని ఫీల్ అవుతారు. మరికొంతమంది తక్కువ అని ఫీల్ అవుతారు.
వీక్‌నెస్

ప్రతి వ్యక్తికి ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అంతేకానీ, వీటిని కూడా భార్యకి చెప్పడం అంత మంచిది కాదు. ఇలాంటివి భార్యకే కాదు.. పది మందిలో కూడా చెప్పడం అంత సబబు కాదు. కాబట్టి, వీక్‌నెస్‌లను అంత త్వరగా బయటపెట్టొద్దు.
అవమానాలు

ఎంత గొప్పవారైనా సరే కొన్నిసార్లు అనుకోకుండా అవమానాలు ఎదురవుతాయి. వీటికి మనం చాలా బాధపడతాం. అలాంటి అవమానాల్ని భర్తకి జరిగినప్పుడు వాటిని ఎప్పుడైనా సరే దాచుకోవడమే మంచిది. భార్యకి చెప్పడం అంత మంచిది కాదు. కారణం, ఏదైనా సందర్భంలో తను సరదాగా ఓ మాట అన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, ఇలాంటి విషయాలని చెప్పకపోవడమే మంచిది.
అసంతృప్తిగా ఉండడం

కొన్ని విషయాల్లో భార్యల ప్రవర్తన భర్తకి నచ్చకపోవచ్చు. వాటిని ముఖం మీదే అనడం మంచిది కాదు. దీని వల్ల వారు బాధపడొచ్చు. అది అలా కాకుండా ఈ విషయాన్ని నువ్వు ఇలా మారిస్తే ఇంకా బాగుంటుందని ఇలా చెప్పొచ్చు. కాబట్టి, ఆ విధంగానే ట్రై చేయండి.
ఫ్యామిలీ సీక్రెట్స్

ప్రతి ఫ్యామిలీలోనూ ఎన్నో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. పెళ్లికి ముందు జరిగినవి చాలానే ఉంటాయి. ఇవన్నీ మ్యారేజ్ కాగానే వెళ్లి తన చెవిలో ఊదకపోవడమే మంచిది. గొడవలు, సీక్రెట్స్, పర్సనల్ డీటెయిల్స్ పూస గుచ్చినట్లు చెబితే చాలా సమస్యలొస్తాయి. కాబట్టి, ఇలాంటి విషయాలను సీక్రెట్‌గానే ఉంచండి.
ఎంత సంపాదిస్తున్నామనేది

ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తుంటారు. వీటి గురించి అంత త్వరగా బయట పెట్టాల్సిన అవసరం లేదు. మీరు సరిగా బడ్జెట్ వేస్తే పర్లేదు. ఆ విషయాన్ని మీ భార్యకి చెప్పాల్సిన పనే లేదు. దీని వల్ల కూడా సమస్యలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ విషయాన్ని చెప్పకపోవడమే మంచిది. దీని వల్ల ఇద్దరి మధ్య గొడవలు తగ్గుతాయి.