Healthy Wellness

పొడవు జుట్టు,పొడవైన జుట్టు ఉన్న ఆడవారినే మగవారు ఎందుకంత ఇష్టపడతారంటే, కారణాలివే – top reasons why men prefer women with long hair

జుట్టు పొడుగ్గా పెంచుకోవడమంటే అమ్మాయిలకి ఇష్టం. అదే విధంగా, పొడవాటి జడ ఉన్న అమ్మాయిలంటే అబ్బాయిలకి కూడా అంతే ఇష్టం. అమ్మాయిలకంటే ఫాంటసీ అనుకోవచ్చు. మరీ అబ్బాయిలు అంతగా ఎందుకు ఇష్టపడతారు.

Samayam Teluguపొడవైన జుట్టు ఉన్న ఆడవారినే మగవారు ఎందుకంత ఇష్టపడతారంటే, కారణాలివే

ఓ వాలు జడ, మల్లెపూల జడ, ఓ పాము జడ, సత్య భామ జడ.. వాలుజడలు కాగితాన విరజాజులు అక్షరంగా.. ఇలా వాలు జడ గురించి కవులు ఎంతగానో మైమరిచిపోయి రాశారు. ఒకప్పుడు వాలుజడలు తెగ ఫ్యాషన్ అయిపోయాయి. ఇప్పుడు పది మందిలో ఒక్కరికి కూడా పొడవు జడ ఉండట్లేదు. దీనికి కారణం ఫ్యాషన్ అనుకుంటే పొరపాటే.. జుట్టు రాలడం, పెరగకపోవడం కూడా కారణమే. చాలా మంది అమ్మాయిలకి పొడవు జుట్టు ఉండాలనుకుంటారు. కానీ, వారి కలలన్నీ కల్లలుగానే మారుతున్నాయి. ఒకవేళ జుట్టు పెరిగినా సన్నగా తోకలా కనిపించేసరికి చాలా మంది అలా చూడలేక దానిని కత్తిరించుకుని చిన్న జుట్టు చింతలేని జుట్టంటూ సరిపెట్టుకుంటున్నారు. కానీ, అబ్బాయిలకి మాత్రం పొడవైన జుట్టున్న, వాలు జడ వేసుకున్న వయ్యారిలన్నా మహా ఇష్టం. అసలు ఎందుకు అంతలా వారు ఇష్టపడతారు. దీని వెనుక కథకమామిషులేంటి తెలుసుకోండి.

ఓపిక ఎక్కువగా ఉంటుందని

పొడవైన జుట్టుని మగవారు ఇష్టపడడానికి కారణం ఓపిక ఎక్కువగా ఉంటుందని. అదేంటి. దీనికి దానికి లింకేంటి అనుకోవద్దు పొడవైన జుట్టును మెంటెయిన్ చేయడం కష్టం, వాటికి తగ్గట్టు డ్రెస్సింగ్, స్టైలింగ్ వంటివి చేయడానికి ఓపికతో పాటు టైమింగ్ ముఖ్యమే. ఆడవారిలో ఈ లక్షణం ఉన్నవారికి తన లైఫ్‌ని కూడా ఈజీగానే మెంటెయిన్ చేయగలనది మగవారు ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది.

అందంగా

అన్నీ సంస్కృతులు, పూర్వ కాలం రోజులు, అంతకుముందు దేవకన్యలు ఇలా ఎవర్నీ చూసుకున్నా పొడవాటి జుట్టుతోనే కనిపిస్తారు. పొడవాటి జుట్టు అనేది ఆడవారికి అందాన్ని తీసుకొచ్చి పెడుతుంది. పొడవు జుట్టు వారి అందంలో ఓ భాగం. సినిమాలు, పుస్తకాలు, కథలు, కళలు ఇలా ఏవి తీసుకున్నా ఆడవారిని పొడవాటి జుట్టు అంటూ అందంగా ఉన్నాయంటూ ఓ ట్రెండ్ చేసి పెట్టారు. దీంతో మగవారి ఆలోచనలు కూడా జుట్టు పొడవుగా ఉంటే అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తారని అదే ఆలోచనల్లో ఉంటారు.

పుట్టబోయే వారికి కూడా పొడవైన జుట్టు

కొంతమందికి పొడవు జుట్టు జన్యుపరంగానే వస్తుంది. అయితే, అదే అలాంటి అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే ఆ లక్షణం పుట్టే ఆడపిల్లలకి కూడా వస్తుందని కొంతమంది మగవారు భావిస్తారు. అందుకే, వారితో పెళ్లికి ముందడుగు వేస్తారని చెప్పొచ్చు.

స్త్రీతత్వం

పొడవాటి జుట్టు అనేది స్త్రీతత్వాన్ని తెలియజేస్తుంది. జుట్టు ఆడవారిలో ముఖ్య భాగం. అది ఆడవారికి ముఖ్య లక్షణంగా భావిస్తారు. చిన్న జుట్టుని ఇష్టపడే మగవారు కూడా ఉన్నారు. కానీ, పొడవాటి జుట్టు ఉన్న ఆడవారికి మగవారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని తెలుస్తుంది.

లైంగింకంగానూ

కొన్ని పరిశోధనల ప్రకారం, పొడవాటి జుట్టు రెగ్యులర్‌గా ఆకర్శిస్తుంది. సరసాలాడేటప్పుడు ఆ జడని తిప్పడం, లాగడం వంటివి ఎన్నో సినిమాల్లో చూపించారు. ఈ ప్రభావం కూడా కాస్తా ఎక్కువగానే ఉంది. దీంతో పొడవాటి జుట్టు వారి మానసికంగా లైంగికంగా బాగుంటుందని మగవారు ఎక్కువగా భావిస్తారు. గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.

రచయిత గురించిరావుల అమలఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.… ఇంకా చదవండి

Exit mobile version