బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తిండిలో మార్పులు, జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయినా, ఫలితం ఉండటం లేదు. మరికొందరు బిజీ షెడ్యూల్ కారణంగా సరైన వ్యాయామం చేయడం లేదు. అందుకే చాలా మంది బరువు తగ్గడం కోసం వాకింగ్‌ను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.

ఉదయం నడక

ఉదయం నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే ప్రశాంతమైన వాతావరణం, తాజా గాలి జీవక్రియను పెంచుతాయి. ఇది హృదయ స్పందన రేటును కూడా మెరుగపరుస్తుంది. ఉదయం నడక జీవక్రియను వేగవంతం చేయడంలో సాయపడుతుంది. ఉదయాన్నే నడవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దీంతో పాటు ఉదయం నడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం నడకతో ప్రయోజనాలు

* ఉదయం నడక కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
* ఉదయం నడవడం వల్ల నిద్ర విధానం మెరుగుపడుతుంది. రాత్రిపూట ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది.
* ఉదయం నడవడం వల్ల మానసిక స్థితి మెరగవుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
* తాదా గాలి, అప్పుడే తగిలే సూర్యకిరణాలు మీ శరీరానికి, మనసుకు శక్తినిస్తాయి.
* ఉదయం నడవడం వల్ల శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. దీంతో, ఎముకలు బలపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సాయంత్రం నడక

చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ వల్ల సమయం దొరకగా సాయంత్రం పూట వాకింగ్ చేస్తుంటారు. సాయంత్రం వేళ నడవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆఫీస్ వర్క్ లేదా ఇతర పనుల్లో ఎక్కువ సమయం గడిపిన తర్వాత సాయంత్రం వాకింగ్ బెస్ట్ ఆప్షన్. ఇది ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప మార్గం. సాయంత్రం వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాయంత్రం నడకతో ప్రయోజనాలు

* సాయంత్రం వేళలో నడవడం వల్ల రోజులోని ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* సాయంత్రం వేళలో నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రి పూట ఎక్కువ తినకుండా అడ్డుకుంటుంది.
* రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల శరీరం ఆహారాన్ని ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది.
* పడుకునే ముందు అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికలను సాయంత్రం వాకింగ్ తగ్గిస్తుంది.
బరువు తగ్గడం కోసం ఎప్పుడు నడవాలి?

ఉదయం, సాయంత్రం రెండు పూటల్లో నడవడం వల్ల బరువు తగ్గవచ్చు. కానీ ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందో అంటే మీ దినచర్యకు ఏ సమయం సరిపోతుంది. ఆ సమయంలో మీ శరీరం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ షెడ్యూల్, శక్తి స్థాయి, జీవనశైలికి తగిన నడక సమయాన్ని ఎంచుకోండి. మీరు ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి అయితే, మార్నింగ్ వాక్ బెస్ట్ ఆప్షన్. వర్క్ టెన్షన్‌తో తీవ్ర ఒత్తిడితో అలసిపోయినట్టు భావిస్తే సాయంత్రం నడక మీకు మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, రోజూ ఏదో ఒక టైంలో తప్పనిసరిగా నడవాలని గుర్తించుకోండి.