ఈ 4 అబద్ధాలతో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.. కచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే

రిలేషన్‌షిప్ అంటేనే నమ్మకం. కానీ, కొంతమంది తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆ నమ్మకం పోతుంది. అలాంటి తప్పుల్లో అబద్ధాలు చెప్పడం కూడా ఒకటి.

Samayam Teluguఈ 4 అబద్ధాలతో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.. కచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే

భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. ఉండొద్దు. కానీ, కొన్నిసార్లు అబద్ధాలు ఉంటాయి. ఇవి ఎప్పుడో ఒకప్పుడు అయితే పర్లేదు. వాటి వల్ల ఎవరికీ ఇబ్బంది రాకపోతే సమస్యే లేదు. అయితే, అబద్ధాలు చెబితే రిలేషన్స్ దెబ్బతింటాయి. ముక్యంగా భార్యాభర్తలు కొన్ని విషయాల్లో అసలే అబద్ధాలు చెప్పొద్దు. దీని వల్ల ఆ రిలేషన్ దెబ్బతింటుంది. అలాంటి అబద్ధాలేంటో.. అవి చెప్పడం వల్ల కలిగే పర్యవసనాలేంటో తెలుసుకోండి.

నేను బానే ఉన్నా..

ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరి మధ్య కొంత దూరం పెరుగుతుంది. అలాంటప్పుడు ఇద్దరిలో ఒకరు ఎదుటివారి దగ్గరికొచ్చి మాట్లాడినప్పుడు నేను బానే ఉన్నా విసిగించొద్దు అని మాట్లాడతారు. ఇలా ‘నే బానే ఉన్నా, ఐ యామ్ ఫైన్’ అని చెప్పడం చాలా పెద్ద అబద్ధమని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. దీని బదులు మీరు మనసులో ఏమనుకుంటున్నారో.. ఏ బాధపడుతున్నారో ఎదుటివాళ్లకి తెలియజేయాలి. అంతేకానీ, నేను బానే ఉన్నా అనే బదంతో వారికి మీ విషయం గురించి ఏం తెలుస్తుంది. దీంతో మీ కోపం తగ్గదు. మనసులోని కోపాలు అలానే ఉండి ఒకేసారి బద్దలై దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, నేను బాగున్నా అని అబద్ధం చెప్పే బదులు మీ మనసులోని బాధనంతా బయటపెట్టేయండి.

అదేం పెద్ద సమస్య కాదు..

ఏదైనా సమస్య గురించి మాట్లాడినప్పుడు ఎదుటివారు దానిని అదేం పెద్ద విషయం కాదు, అదేం సమస్య కాదు అన్నట్లుగా మాట్లాడతారు. ఇది వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. వారిని నిర్లక్ష్యం చేసినట్లుగా ఫీల్ అవుతారు. దీంతో వారు ఏ సమస్యని కూడా మీతో పంచుకోలేరు. కాబట్టి, చెప్పిన విషయాల్ని నెగ్లెక్ట్ చేయడం, చిన్నవే అని కొట్టిపారేయకుండా వాటిని సాల్వ్ చేసుకోవడం మంచిది.

నేను వాటిని మారుస్తా..

మీ పార్టనర్ మీకు ఏదైనా సమస్య చెప్పినప్పుడు వాటన్నింటినీ మారుస్తా.. అన్నింటినీ చక్కబెడుతా అని చెప్పినప్పుడు వాటిని చేసి చూపించాలి. అంతేకానీ, జస్ట్ టెంపరరీగా ఆ మాట ఇవ్వొద్దు. ఆ మాట ఇస్తే కచ్చితంగా దానిని మార్చాలని గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చిన మాట తప్పితే వాటిని అబద్ధాలుగానే మీ పార్టనర్ అనుకునే ప్రమాదం ఉంది.

తర్వాత మాట్లాడుదాం..

ఈ విషయంలో మగవారు ఎక్కువగా అబద్ధాలాడతారు. అదేంటంటే.. ఏదైనా విషయం గురించి గొడవ జరుగుతుందని వారు భావించినప్పుడు ఇప్పుడే వద్దు దాని గురించి తర్వాత మాట్లాడదామని పోస్ట్‌పోన్ చేస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల ఒకేసారి పెద్ద భూకంపం వచ్చినట్లవుతుంది. అలా కాకుండా ఎప్పటికప్పు ఆ సమస్యని వీలైనంతగా సాల్వ్ చేసుకుంటే ఇద్దరి మధ్య ఎలా బేధాభిప్రాయాలు ఉండవు. హ్యాపీగా రిలేషన్ ముందుకు సాగుతుంది.

రావుల అమల

రచయిత గురించిరావుల అమలఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.ఇంకా చదవండి

Leave a Comment